మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2019 (19:04 IST)

భారత్-పాకిస్తాన్‌లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు... ఎందుకు?

గత ఏడాది పాకిస్తాన్‌లో ఎన్నికల ప్రచారం చేసిన తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ తమ మేనిఫెస్టోలో 'నవ పాకిస్తాన్‌'లో పేదలకు 50 లక్షల చౌక ఇళ్లు, నిరాశ్రయులకు షెల్టర్ హోమ్స్, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పించింది.
 
అలా చేస్తే, పాకిస్తాన్ మరో ఐదేళ్లలో సంక్షేమ దేశంగా మారిపోతుంది.
 
గత 16 నెలలుగా లాహోర్‌లో మూడు, ఇస్లామాబాద్‌లో ఒక ప్రభుత్వ షెల్టర్ నిర్మించారు. వీటిలో రాత్రి పూట 700 మంది నిరాశ్రయులు తలదాచుకుంటారు. సర్కారు ఇదే వేగంతో వెళ్తే, రెండు కోట్ల మంది నిరాశ్రయులకు ఎక్కడో ఒకచోట తలదాచుకునే షెల్టర్ కచ్చితంగా దొరకాలంటే మరో 300 ఏళ్లు పడుతుంది.
 
ఇక 50 లక్షల చౌక ఇళ్ల విషయానికి వస్తే, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత ఐదు నెలల్లో ఐదు 'నవ పాకిస్తాన్' హౌసింగ్ స్కీమ్స్ గురించి చెప్పారు. వీటిలో ఒక ఇంటిని ఏడున్నర లక్షల రూపాయలతో నిర్మిస్తారు. ఎవరి దగ్గరైనా ఆ ఏడున్నర లక్షల రూపాయలు కూడా లేకపోతే, ఆ పేదలు పేదరికానికే ఓ మచ్చలా మిగిలిపోతారు.
 
 
ఆహారం, ఉద్యోగాల హామీ 
ఇక కోటి ఉద్యోగాల విషయానికి వద్దాం. మేం ఉద్యోగాలు ఇస్తామని ఎలాంటి హామీ ఇవ్వలేదని పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాగ్ చౌధరి పోయిన వారం బహిరంగంగానే చెప్పేశారు. "ప్రైవేటు సెక్టార్ల కోసం ఒక కోటి ఉద్యోగాలు లభించేలా ప్రభుత్వం ఒక వాతావరణం సృష్టిస్తుందని మాత్రమే మేం చెప్పాం" అన్నారు.
 
పాకిస్తాన్‌లో ప్రస్తుతం దాదాపు 40 శాతం జనాభా కడుపు నిండా తినలేకపోతున్నారు. దిగువ తరగతి వర్గాల వారు ఆదాయంలో దాదాపు 60 శాతం కడుపు నింపుకోడానికే ఖర్చు చేస్తున్నారు.
 
కానీ ప్రధానమంత్రి మాత్రం 'ఏం చింతించకండి' అంటారు. గత వారం ఆయన ఇస్లామాబాద్‌లో సీలానీ ట్రస్ట్‌ అనే ఒక ఎన్జీవోతో కలిసి పేదలకు ఉచిత భోజనం అందించే క్యాంటీన్ తెరిచారు. అందులో రోజుకు 600 మంది కడుపు నింపుకోవచ్చు. ప్రభుత్వం ఇలా కనీసం 600 క్యాంటీన్లు తెరుస్తుంది. ఎందుకంటే ఉపాధి లేదు.
 
ఈ లెక్కన పాకిస్తాన్‌ 22 కోట్ల మంది జనాభాలో ఆకలితో జీవించే 8 కోట్ల మందికి ఎన్నేళ్లలో కడుపునిండా ఏదైనా తినగలిగే సౌకర్యం లభిస్తుందో.. ఆ దేవుడికే తెలియాలి.
 
ప్రస్తుతం పాకిస్తాన్‌లోని గోదాములు మొక్కజొన్నలు, చక్కెరతో నిండిపోయాయి. వాటిలో కొత్తగా వచ్చే ఉత్పత్తులు నింపడానికి చోటే లేదు.
 
 
భారత్-పాక్ రెండిట్లో ఆహార కొరత 
కొన్ని రోజుల ముందు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదలైంది. అందులో ఉన్న 117 దేశాల్లో పాకిస్తాన్ ప్రస్తుతం 94వ స్థానంలో ఉంది. కానీ మాకు విషాద వార్త ఏంటంటే బంగ్లాదేశ్ 88వ స్థానంలో ఉంది. సంతోషించాల్సిన విషయం ఏంటంటే, భారత్ మాకంటే కింద 102వ స్థానంలో ఉంది.
 
ఈ 'అచ్చే దిన్' రాక ముందు 2010లో భారత్ 'గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌'లో 95వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం మా గోదాముల్లో ఇక ధాన్యం పెట్టడానికి చోటు లేదు అని చెబుతోంది.
 
కానీ, యూపీలో చాలా స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఉప్పు, రొట్టె లేదంటే అన్నంలో పసుపు నీళ్లు కలిపి తింటున్నారు.
 
కానీ, కొందరు మాత్రం దేశద్రోహులైన జర్నలిస్టులే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తారని అనుకుంటారు.
 
నాకు భారత ప్రభుత్వంతోగానీ, పాకిస్తాన్ సర్కారుతో గానీ ఎలాంటి శత్రుత్వం లేదు. నేను ఇమ్రాన్ ఖాన్‌కు 'ఏం చింతించకండి'... అనే మాటను నేర్పించిన వ్యక్తి వివేకాన్ని ప్రశ్నిస్తున్నాను.
 
అమెరికాలో 'హౌడీ మోడీ'లో అలాంటి మాటనే పదే పదే అన్నారు.
 
"మిత్రో సబ్ అచ్చా హై... బధా మజా మా ఛే... షోబ్ ఖూబ్ భాలో...అందరూ బాగున్నారు.." చప్పట్లు...