శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (15:17 IST)

పాదాల పగుళ్లకు అరటి గుజ్జును పూతలా వేసుకుంటే..?

పాదాల పగుళ్లకు అరటి గుజ్జు భేష్‌గా పనిచేస్తుంది. పాదాలు మృదువుగా తయారు కావాలంటే.. అరటి పండు గుజ్జును పాదాలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పాదాల్లో ఏర్పడే ముడతలు కూడా తొలగిపోతాయి. అలాగే యాంటీ యాక్సిడెంట్స్ గుణాలున్న తేనెను వాడితే పాదాల పగుళ్లు ఏర్పడవు. 
 

రెండు స్పూన్ల బియ్యం పిడితో ఒక స్పూన్ తేనె, ఆపిల్ సిడర్ వెనిగర్‌ను చేర్చి పేస్టులా తయారు చేసి పాదాలకు పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇంకా పావు కప్పు వేపాకు పేస్టులో కాస్త సున్నం కలిపి పాదాలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే.. పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే బొప్పాయి గుజ్జు, ఎండిన బంగాళాదుంపల పొడి, మెంతికూర గుజ్జును కూడా పాదాలకు పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే.. పాదాల పగుళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.