శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (11:32 IST)

ఐస్‌క్యూబ్స్‌తో అందం మీ సొంతం..

ప్రతిరోజూ కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి తలనొప్పి రావడం సహజమే. మరి నొప్పిని తగ్గించేందుకు మీరేం చేస్తున్నారు.. వీలైతే వైద్య చికిత్సలు తీసుకుంటారు లేదంటే మందులు వాడుతుంటారు. ఇలా చేయడం మంచిదే కానీ ఎల్లప్పుడు మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. అవేంటో చూద్దాం..
 
ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అయినా కూడా కొందరి ముఖం అలసటగానే ఉంటుంది. అందుకు ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఐస్‌క్యూబ్‌లతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు ముఖంపై మురికి తొలగిపోతుంది. దాంతో ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
అలానే మేకప్ ఎక్కువగా వేసుకునే వారి ముఖం ముడతలు మారుతుంది. దాంతో ముఖం అందాన్ని కోల్పోతుంది. అందుకు ఐస్‌క్యూబ్స్‌తో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ముడతలు చర్మం కాస్త మృదువుగా మారుతుంది. మేకప్ శుభ్రం చేయడానికి కూడా ఐస్‌క్యూబ్స్ వాడితే మంచిది. 
 
ఐస్‌క్యూబ్స్‌తో ముఖాన్ని మర్దన చేయడం వలన శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. పొడిబారిన చర్మానికి ఐస్‌క్యూబ్స్‌తో మర్దన చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. మెుటిమలు తొలగిపోవడానికి రకరకాలు క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడుతుంటారు. వీటిని వాడడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు.. కనుక ప్రతిరోజూ ఐస్‌క్యూబ్స్‌తో ముఖానికి మర్దన చేసుకుంటే మెుటిమలు రావు.