శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (18:56 IST)

జుట్టుకు మేలు చేసే... ఆయుర్వేద నూనె.. తయారీ ఇలా..

Ayurvedic Oil
Ayurvedic Oil
జుట్టు చాలా అందంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం అందరినీ హెయిర్ ఫాల్. అలాగే జుట్టు నెరవడం. దీనికోసం చాలామంది భారీగా ఖర్చు పెట్టేందుకు వెనుకాడట్లేదు. అలాంటి వారు మీరైతే... ముందు జుట్టు రాలడానికి చాలా కారణాలను తెలుసుకోవాలి.  అలాగే ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆయుర్వేద నూనెను సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ద్వారా హెయిర్ ఫాల్‌తో పాటు జుట్టు నెరవడం కూడా పరిష్కరించవచ్చు. 
 
కావలసినవి:- కొబ్బరినూనె- 2 లీటర్లు కరివేపాకు- ఒక పిడికెడు, మందార పువ్వు- 10, మందార ఆకులు- ఒక గుప్పెడు, వేప ఆకులు- ఒక గుప్పెడు, గోరింటాకు- గుప్పెడు, చిన్న ఉల్లిపాయ- తరిగినవి.. అరకప్పు, మొక్కజొన్న ఆకులు- ఒక కప్పు, మెంతులు- రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ - 3 (తరిగినవి) మెంతులు- 2 టీస్పూన్లు వట్టివేరు- పావుకప్పు
 
ముందుగా వేడైన ఇనుప బాణలిలో కొబ్బరి నూనె పోసి బాగా వేడయ్యాక కరివేపాకు, వేప ఆకులు, గోరింటాకులు, కరివేపాకు, ఉల్లిపాయ ఉసిరికాయ తరుగు వేసి బాగా వేపాలి. కలబంద ముక్కలను కూడా నూనెలో వేయవచ్చు. తర్వాత మెంతులు, నల్ల జీలకర్ర, వట్టివేరును బాగా నూనెలో వేపాలి. 
 
మీడియం మంటలో వుంచి వేసిన పదార్థాలన్నీ నూనెలో బాగా వేగాక నూనె రంగు మారుతుంది. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి.. ఒక రోజంతా అదే పాత్రలో ఆపదార్థాలన్నీ నూనెలోనే ఉంచాలి. ఈ పదార్థాల సారం కొబ్బరినూనెలో బాగా ఇమిడాక.. దానిని ఫిల్టర్ చేసి అవసరమైన పాత్రలో మార్చుకోవాలి. ఈ నూనె రెండు లేదా మూడు నెలల వరకు చెడదు. జుట్టు రాలడం, జుట్టు నెరవడం, చుండ్రుతో బాధపడేవారికి ఈ నూనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది.