శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 12 జూన్ 2017 (12:36 IST)

జుట్టుకు మేలు చేసే సొరకాయ రసం.. తెల్లసొన, పెరుగును మిశ్రమాన్ని?

జుట్టు రాలిపోతుంటే.. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వేడి చేసి వాడాలి. దీన్ని వెంట్రుకలకు రాసుకుని కుదుళ్లను వేళ్లతో మర్దన చేసుకోవాలి. దీంతో కుదుళ్లు బలపడతాయి. అలాగే జుట్టు మెరవాలంటే.. రెండు మూడు టేబుల్

జుట్టు రాలిపోతుంటే.. కొబ్బరి నూనె లేదా బాదం నూనెను వేడి చేసి వాడాలి. దీన్ని వెంట్రుకలకు రాసుకుని కుదుళ్లను వేళ్లతో మర్దన చేసుకోవాలి. దీంతో కుదుళ్లు బలపడతాయి. అలాగే జుట్టు మెరవాలంటే.. రెండు మూడు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత 30నిమిషాల పాటు అలా ఉంచి కడిగేసుకోవాలి. సొరకాయ రసాన్ని కురులకు పట్టించి అరగంట పాటు ఉంచిన తర్వాత తల స్నానం చేయండి. మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు మృదువుగా తయారవుతాయి.
 
ఆరోగ్యకమైన శిరోజాలకు ఉపయోపడే ఎంజైమ్‌లు అలోవెరాలో ఉన్నాయి. అలోవెరా జ్యూస్ లేదా జెల్ జుట్టు కుదుళ్లకు రాసుకోవాలి. అలాగే అలోవెరా జ్యూస్‌ను రోజూ ఓ టీ స్పూన్ కడుపులోకి తీసుకున్నా జుట్టు పెరుగుతుంది. గుడ్డులోని తెల్లసొన, పెరుగు మిశ్రమం కూడా జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. రెండు కోడిగుడ్లలోని తెల్లసొనను కప్పులోకి తీసుకుని దానికి రెండు చెంచాల తాజా పెరుగు కలుపుకోవాలి. దీనికి నీమ్ పౌడర్ కలుపుకుని జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతుందని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.