గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (12:12 IST)

బ్లాక్ హెడ్స్‌ తొలగిపోవాలంటే.. ఉప్పు, టూత్‌పేస్ట్ తీసుకుని?

బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవాలంటే.. అరస్పూన్ నిమ్మరసంలో.. అరస్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ మీద రాయాలి. ఆపై 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి నాలుగైదుసార్లు చ

బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవాలంటే.. అరస్పూన్ నిమ్మరసంలో.. అరస్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ మీద రాయాలి. ఆపై 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. తేనెలోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల బ్లాక్‌హెడ్స్‌కి కారణమైన బ్యాక్టీరియా తొలగిపోతుంది. 
 
అలాగే కోడిగుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని బ్లాక్ ‌హెడ్స్‌పై పూతలా వేసుకోవాలి. ఆరాక మళ్లీ మళ్లీ రెండు లేయర్లు పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
ఇకపోతే... టీస్పూను ఉప్పులో టీస్పూను తెల్ల టూత్‌పేస్టు వేసి బాగా కలిపి ముక్కుమీద పట్టించి ఆరనివ్వాలి. ఎండిపోయాక వేళ్లను తడిచేసుకుని మర్దన చేసినట్లుగా మృదువుగా ఆ పేస్టుని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినా ఫలితం ఉంటుంది. ఇక, ఆవిరి పట్టడం వల్ల కూడా చాలావరకూ సమస్య తగ్గుతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.