శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 11 జూన్ 2018 (17:16 IST)

జుట్టు రాలిపోతుందా... ఈ చిట్కాలు పాటిస్తే...

జుట్టు ఒత్తుగా పెరగాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లను ఎక్కువగా తీసుకోవ

జుట్టు ఒత్తుగా పెరగాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, మామిడి వంటి పసుపు రంగు పండ్లను కూడా తీసుకోవాలి. కూరగాయలను డైట్‌లో చేర్చుకుంటే మంచిది. ఇది యాంటీ-ఏజింగ్‌లా పనిచేస్తుంది.
 
అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. జూట్టుకు ఓట్‌మీల్, టమాటో ప్యాక్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. టమాటాకు, ఓట్‌మీల్‌ను పేస్ట్ చేసుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలాచేయడం వలన మీ జుట్టు అందంగా పొడవుగా పెరుగుతుంది.
 
బాదం పప్పులను నానబెట్టి తరువాత వాటిని పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కాస్త తేనెను కలిపి జుట్టుకు రాసుకుంటే తలలోగల మురికిని అంత తొలగిస్తుంది. పాలులో ఒక స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం, కొద్దిగా బాదం నూనె కలిపి మిశ్రమంగా తయారుచేసుకుని జుట్టుకు రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.