గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (19:48 IST)

నిమ్మకాయతో అందానికి మెరుగులు... ఎలా?

1. చర్మం నల్లగా ఉంటే దానిని రూపుమాపేందుకు పాల మీగడలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని ముఖానికి రాయండి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి. 
 
2. మోకాళ్ళు, మోచేతులపైనున్న నలుపుదన్నాన్ని దూరం చేసేందుకు నిమ్మకాయ తొక్కతో రుద్దండి. దీంతో నలుపుదనం తొలగిపోతుంది. 
 
3. శరీర చర్మంకోసం నిమ్మకాయ ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయను పలు ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించి వాడుతుంటారు. దీంతో శరీర మేనిఛాయ మెరుగవుతుంది. 
 
4. మేని ఛాయను మెరుగుపరచుకునేందుకు టమోటా రసంలో కాసింత పసుపు పొడి కలుపుకుని మీ ముఖానికి పూయండి. కాసేపయ్యాక చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేయండి. దీంతో అందం మరింత రెట్టింపవుతుంది. 
 
5. ద్రాక్ష రసంలో తేనె కలుపుకుని ముఖానికి పూయండి. దీంతో మీ ముఖారవిందం పెరుగుతుందంటున్నారు బ్యుటీషియన్లు.