మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..
మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం.. ఎలా చేయాలంటే..? బాగా మగ్గిన మామిడి పండు, అలొవెరా జెల్- మూడు టీస్పూన్లు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్ వాటర్- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు.
తయారీ విధానం : ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, అలొవెరా, రోజ్‌వాటర్ వేసి బాగా కలిపితే మ్యాంగ్ ఫేస్‌ప్యాక్ రెడీ.
ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం మెరిసిపోతుంది.