మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:56 IST)

ఉల్లిరసం, పెరుగు, లావెండర్ ఆయిల్.. ఈ మూడింటిని?

ఉల్లిరసంలో శెనగపిండి, మీగడ చేర్చి ముఖానికి రాసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది. ఉల్లిరసంతో కూడిన ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు చేస్తే పిగ్మెంటేషన్ తగ్గి చర్మం మెరిసిపోతుంది. చర్మం నిర్జీవంగా తయారైతే ఉల్లి రసాన్ని నేరుగా ముఖం మీద పూసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఉల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌, విటమిన్లు చర్మానికి సరిపడా పోషణను అందిస్తాయి. 
 
అలాగే ఉల్లి రసంలో కాటన్‌ను ముంచి రోజూ ఉదయం పూట ముఖ చర్మానికి రాసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది. ఇలా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. ఉల్లిరసంలోని విటమిన్ సి.. చర్మంపై వున్న మచ్చలను తొలగిస్తుంది. 
 
ఒక టేబుల్ స్పూన్ ఉల్లిరసానికి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, నాలుగైదు చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. రెండు స్పూన్ల నిమ్మరసం, రెండు స్పూన్ల ఉల్లి రసం చేర్చి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తళతళ మెరిసిపోతుంది. రోజూ పసుపు, ఉల్లిరసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంపై వున్న మచ్చలు తొలగిపోతాయని బ్యూటీషియన్లు అంటున్నారు.