చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఏంటి లాభం?
ప్రతి ఒక్కరూ తాను అందంగా ఉండాలంటే ఎప్పుడూ ఇష్టపడతారు. దీని కోసం మహిళలు ఇంట్లోనే పేస్ పేక్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. చింతపండును మనం వంటకాల కోసం వాడుతుంటాం. అయితే ముఖ సౌందర్యానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. చింతపండుతో ఎలా ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు? ఇంకా చింతపండు ఫేస్ ప్యాక్ ద్వారా వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
ఒక స్పూన్ చింతపండు రసానికి ఒక స్పూన్ పెరుగు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. చింతపండు ఫేస్ ప్యాకుతో చర్మం మృదువుగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి.