శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (19:27 IST)

కడుపు మాడ్చుకుంటే నాజూగ్గా ఉంటారా?

చాలామంది నాజూగ్గా ఉండేందుకు పస్తులుంటుంటారు. అంటే డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నాజూగ్గా మారడం దేవుడెరుగ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం లేకపోలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 
అయితే, నాజూగ్గా కనిపించాలంటే మాత్రం ఆహారంపై నియంత్రణ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఒక్కసారిగా డైట్‌ను తగ్గించేయడం వల్ల నీరసం, ఆకలి, పనిమీద శ్రద్ధ లోపించడం వంటివన్నీ తప్పవు. శరీరబరువుని తగ్గించుకోవాలని ఆతృతపడేవారు ఆ దిశగా నెమ్మదిగా చర్యలు ఆరంభించాలి. 
 
ఇందులోభాగంగా, ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. ఈ వాకింగ్ కిలోమీటర్ల మేరకు మారథాన్ నడక సాగించాల్సిన అవసరంలేదు. ప్రతిరోజూ 20 నిమిషాల సేపు నడిస్తే చాలని చెప్పారు. అదికూడా ఇబ్బంది అనుకునే వారు కొద్దిరోజుల పాటు ఐదేసి నిమిషాలు చొప్పున, పెంచుకుంటూ పోవాలి.
 
అలాగే, కడుపు మాడ్చుకోవడం అన్నది ఎవరికీ సరైన పద్ధతి కాదు. రెండు గంటలకొకసారి తింటుండాలి. ముందుగా ఆహార పరిమాణాన్ని తగ్గించాలి. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా ముందుకంటే తగ్గించాలి.
 
టెలివిజన్ ముందు కూర్చునితినడం ఆరంభిస్తే, తినే పరిమాణం పెరుగుతుందనేది పరిశోధకుల మాట. కాబట్టి తినే సమయంలో టెలివిజన్ స్విచ్ కట్టేయాల్సిందే. వీలైనంత వరకు ఒంటరిగా ఆహారం తనవద్దు. పక్కన ఎవరైన ఉంటే షేర్ చేసుకోవడం వల్ల తినే పరిమాణం తగ్గుతుంది.