శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (17:53 IST)

పేద ప్రజలకు తీపి కబురు.. మే, జూన్​ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు

కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు తీపి కబురు చెప్పింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన పథకం కింద మే, జూన్​ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది కేంద్రం. మే, జూన్ నెలల్లో మొత్తం 80 కోట్ల మంది లబ్దిదారులకు ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ఆహారధాన్యాలకు తొలివిడతలో రూ. 26వేల కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఈ పథకం కోసం రెండు నెలలకు కేంద్రం రూ. 26వేల కోట్లు వెచ్చించనుంది. కరోనాతో దేశ ప్రజలు పోరాడుతున్న వేళ వారికి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పినట్లు ఆహార, ప్రజా పంపిణీ వ్యవస్థ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కాగా.. రోజువారీ పాజిటివ్ కేసులు ఏకంగా 3 లక్షల మార్కును దాటాయి. గత రెండు రోజుల నుంచి వరుసగా మూడు లక్షలకుపైగా కొత్త కోవిడ్-19 నమోదయ్యాయి.