ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

చౌక ధరకే ఎయిర్ ఏషియా టిక్కెట్

దేశంల చౌక ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఎయిర్‌ఏషియా మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద దేశీయ ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,019గా నిర్ణయించింది. 
 
అలాగే, అంతర్జాతీయ రూట్లలో రూ.2,399గా నిర్ణయించింది. ఎయిర్‌ఏషియా బిగ్ సభ్యులు సోమవారం నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించిన సంస్థ.. సాధారణ ప్రజలు ఈ నెల 4 నుంచి 10 వరకు టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చునని సూచించింది.
 
ఈ తరహా టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులు వచ్చే ఏడాది ఏప్రిల్ 27 నుంచి మార్చి 1, 2021 వరకు ఎప్పుడైన ప్రయాణం చేయవచ్చు. దీనిపై కంపెనీ సీవోవో సంజయ్ కుమార్ మాట్లాడుతూ, సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలిపారు.