1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (15:57 IST)

బ్యాంకులకు 2 రోజుల సెలవులు

banks
ఈ వారంలో బ్యాంకులకు వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 14వ తేదీన తమిళ కొత్త సంవత్సరంతో పాటు డాక్టర్ అంబేద్కర్ జయంతి కారణంగా బ్యాంకులకు సెలవు దినంగా ఉంది. అలాగే 15వ తేదీన గుడ్‌ఫ్రైడే కావడంతో ఆ రోజుకు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, శనివారం ఒక్క రోజు బ్యాంకులు తెరుచుకుని, ఆదివారం మళ్లీ మూతపడనున్నాయి. 
 
నిజానికి ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులుకు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు బ్యాంకులు మూసివుంటారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సెలవులు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లోని పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి ఈ సెలవులు ఉంటాయి.
 
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి. ఇదే రోజు మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా వస్తున్నాయి. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.
 
ఏప్రిల్ 15వ తేదీన గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. రాజస్తాన్, జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ మినహా ఏప్రిల్ 15న అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
ఏప్రిల్ 16న కేవలం అస్సాంలో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. ఈరోజు అస్సాంలో బొహగ్ బిహు పండగను జరుపుకుంటారు. ఏప్రిల్ 17 ఆదివారం కాబట్టి... ఈరోజు అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.