‘బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్’ని ప్రారంభించిన బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ
బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్‌ను ప్రారంభించినట్లుగా బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ నేడిక్కడ ప్రకటించింది. ఇది ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీమ్. ఇది హెల్త్, వెల్‌నెస్ సంబంధిత రంగాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఫండ్ సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెం బర్ 6న తెరవబడుతుంది, న్యూ ఫండ్ ఆఫర్ వ్యవధి డిసెంబర్ 20, 2024న ముగుస్తుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్ అనేది ఫార్మాస్యూటికల్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, వెల్‌నెస్ రంగాలలో ఉన్న కంపెనీల ఈక్విటీ, ఈక్విటీ-సంబంధిత సాధనాలలో ప్రధానంగా పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘ కాలంలో సంపద సృష్టి సామర్థ్యాన్ని కోరుకునే మదుపరులకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఐదు సంవ త్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి కాలవ్యవధికి అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం బీఎస్ఈ హెల్త్‌కేర్ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌పై బెంచ్‌మార్క్ చేయబడింది.
భారతీయ ఆరోగ్య సంరక్షణ రంగపు డైనమిక్ వృద్ధిని ఉపయోగించుకోవడం ఈ ఫండ్ లక్ష్యం. జనాభా గణాం కాలు, పెరుగుతున్న ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ వ్యయాలు, సాంకేతిక పురోగతులు, ఇతర అంశాల కారణంగా పరిశ్రమ గణనీయమైన పరివర్తనకు లోనవుతోంది. ఈ ఫండ్ మదుపరులకు హెల్త్, వెల్నెస్ బూమ్ నుండి ప్రయోజనం పొందేందుకు, ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న మెగాట్రెండ్‌లలోకి ప్రవేశించడానికి అవకాశా న్ని అందిస్తుంది. దీని పోర్ట్‌ఫోలియో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, డయా గ్నోస్టిక్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్, హాస్పిటల్స్, హెల్త్‌కేర్ ఫెసిలిటీస్, మరిన్నింటితో సహా అనేక రంగాలలో విస్తరించి ఉంటుంది. ఈ పథకం బీఎస్ఈ హెల్త్‌కేర్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ (TRI)లో భాగమైన రంగాలకు చెందిన కంపెనీలలో కనీసం 80% పెట్టుబడి పెడుతుంది.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ సీఈఓ గణేష్ మోహన్ మాట్లాడుతూ, బజాజ్ ఫిన్‌సర్వ్ హెల్త్‌కేర్ ఫండ్ అనేది మదు పరులకు హెల్త్, వెల్నెస్ రంగంలో బలమైన వృద్ధిని పొందేందుకు ఒక వ్యూహాత్మక మార్గం. విస్తృత మార్కె ట్‌తో తక్కువ సహసంబంధంతో (వివిధ రకాల హెచ్చుతగ్గుల ప్రతిఫలాలతో) ఈ హెల్త్ కేర్ ఫండ్ వ్యూహాత్మ కంగా ఉంది. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ బూమ్‌కు అనుగుణంగా ఈ పథకం కొత్త యుగం పెట్టుబడి పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దీర్ఘకాలిక పోకడలు, అవకాశాలతో ప్రతిధ్వ నిస్తుంది. దీర్ఘకాలికంగా మార్కెట్‌లో రాణించేందుకు ఈ ఫండ్ సమాచారం, ప్రవర్తన, పరిమాణాత్మక ప్రయో జనాలను ఉపయోగించుకోడాన్ని నొక్కి చెబుతుంది అని అన్నారు.
ఈ హెల్త్‌కేర్ ఫండ్ గురించి బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ సీఐఓ నిమేష్ చందన్ మాట్లాడుతూ, “ఆరోగ్య సంరక్షణ రంగం దీర్ఘకాల సంపద సృష్టికి అపారమైన అవకాశాలను, సామర్థ్యాన్ని అందిస్తుంది. భవిష్యత్తులో లాభా లను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకోవడం, కీలకమైన మెగా ట్రెండ్‌లలో పెట్టు బడి పెట్టడం ద్వారా, మేం పరిశ్రమ వృద్ధి కథనాలను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విధానం మా ఫండ్ ప్రస్తుత అవకాశాలను ఉపయోగించుకోవడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ ల్యాండ్‌స్కేప్‌లో సుస్థిరమైన విజయానికి పెట్టుబడిదారులను ఉంచేలా చేస్తుంది అని అన్నారు.