ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2023 (17:56 IST)

వరి రైతుల కోసం ‘మెంటార్‌’ను విడుదల చేసిన క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌

image
సుప్రసిద్ధ ఆగ్రోకెమికల్‌ కంపెనీ క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ నేడు నూతన ఫంగిసైడ్‌ ‘మెంటార్‌’ను వరి రైతుల కోసం విడుదల చేసింది. వరిలో కనిపించే తెగుళ్లు (ఆకు మడత) వంటి వాటిని నియంత్రించడంతో పాటుగా వరి పంటకు అదనపు రక్షణ సైతం అందించి అధిక దిగుబడిని సైతం అందిస్తుంది. మెంటార్‌ను పలు రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలలో పరీక్షించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో 1000కు పైగా డెమాన్‌స్ట్రేషన్‌లను సైతం రైతులతో కలిసి పలు మార్కెట్‌లలో చేశారు. వరిలో సాధారణంగా కనిపించే తెగుళ్ల నియంత్రణకు ఇది తోడ్పడటంతో పాటుగా రైతులకు అత్యంత ప్రయోజనకారిగా ఇది నిలిచింది.

 
‘‘రైతులకు మాత్రమే కాదు, దేశపు ఆహార భద్రత పరంగా కూడా అతి ముఖ్యమైన పంట వరి. ఇప్పుడు మా ఆర్‌ అండ్‌ డీ ఆధారిత ఉత్పత్తి మెంటార్‌ను విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇది అత్యంత శక్తివంతమైన ఫంగిసైడ్‌. ఇది రైతులకు అధిక లాభాలను సైతం అందించనుంది’’ అని క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ లిమిటెడ్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌) సీఎస్‌ శుక్లా అన్నారు. మెంటార్‌తో ఇప్పుడు క్రిస్టల్‌ క్రాప్‌ వరి రైతులు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, హర్యానా లాంటి ప్రాంతాలకు చేరుకోగలదు. రబీ సీజన్‌ నుంచి మెంటార్‌ రైతులకు అందుబాటులో ఉంటుంది.

 
‘‘ఈ నూతన ఉత్పత్తిని భారతీయ రైతులకు అంకితం చేస్తున్నాము. కంపెనీ మరింతగా మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు ఇది తోడ్పడటంతో పాటుగా వరిపై ఆధారపడిన వారికి మరింతగా లాభాలు చేకూర్చగలదు’’ అని క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ లిమిటెడ్‌ నేషనల్‌ సేల్స్‌ హెడ్‌- అజిత్‌ శంఖ్దర్‌ అన్నారు. అత్యాధునిక ఆర్‌ అండ్‌ డీ ఏర్పాట్లతో క్రిస్టల్‌ క్రాప్‌ రాబోయే ఆర్ధిక సంవత్సరం నాటికి మరో 4-5 నూతన ఉత్పత్తులను విభిన్న పంటల వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రణాళిక చేసింది. ఇటీవలనే ఐఎఫ్‌సీ, ఎమర్జింగ్‌ ఆసియా ఫన్‌ నుంచి 300 కోట్ల రూపాయలను క్రిస్టల్‌ క్రాప్‌ అందుకుంది. తద్వారా తమ ఆర్‌ అండ్‌ డీ సామర్ధ్యంను మరింతగా బలోపేతం చేసుకోనుంది.