శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (20:06 IST)

దుబాయ్‌లో 2026 నాటికి నగరంలో ఫ్లయింగ్ టాక్సీలు

dubai
దుబాయ్ 2026 నాటికి నగరంలో ఫ్లయింగ్ టాక్సీలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2017 నుంచి ఈ టాక్సీల కోసం దుబాయ్ సర్కారు కసరత్తు చేస్తోంది. దుబాయ్ వార్షిక ప్రపంచ ప్రభుత్వం శిఖరాగ్ర సమావేశంలో ఫ్లయింగ్ టాక్సీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 
 
ఈ మేరకు దుబాయ్ పాలకుడు, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, పునరుద్ధరించబడిన ఫ్లయింగ్ టాక్సీ ప్రోగ్రామ్ గురించి ట్విట్టర్‌లో ప్రకటించారు. 
 
దుబాయ్ ఇప్పుడు ప్రచారం చేస్తున్న ఫ్లయింగ్ టాక్సీ కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌లో జాబీ ఏవియేషన్ తయారు చేసిన ఆరు-రోటర్ ఎలక్ట్రిక్ టాక్సీగా ఇవి అమలులోకి రానుంది. 
 
దుబాయ్‌లో ఎగిరే టాక్సీల పరిచయం నగరానికి కొత్త స్థాయి ఆవిష్కరణ- సౌకర్యాన్ని తెస్తుంది. ఇది ఇప్పటికే ఐకానిక్ ఆర్కిటెక్చర్- ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందింది. 
 
2026 ప్రారంభ తేదీకి ఇంకా చాలా సంవత్సరాల దూరంలో ఉంది. అయితే ఈ ప్రకటన ఇప్పటికే దుబాయ్ నివాసితులు.. సందర్శకులలో ఉత్సాహాన్ని నింపుతోంది.