శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఎక్సైజ్ సుంకం తగ్గింపు : హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ఎంత?

కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా పెట్రోల్, డీజల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.5, డీజల్‌పై రూ.10 చొప్పున తగ్గించాయి. దీంతో వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ తగ్గించిన ఎక్సైజ్‌ గురువారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. 
 
మరో వైపు ఎక్సైజ్‌ సుంకంపై రాష్ట్రం విధించిన వ్యాట్‌ కూడా తగ్గింది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.6.33, డీజిల్‌పై రూ.12.79 వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.18, లీటర్‌ డీజిల్‌ రూ.94.61కు చేరింది. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఇంధర ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. లీటర్‌ పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌లో రూ.120 దాటగా.. లీటర్‌ డీజిల్‌ రూ.110 వరకు చేరింది. ఈ క్రమంలో అన్నివర్గాలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో దీపావళి సందర్భంగా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.