ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (11:21 IST)

పసిడి ధరలు పడిపోయాయి..

దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు మరింతగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్- ఎంసిఎక్స్‌లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా తాజాగా 10 గ్రాముల గోల్డ్ ధర 0.68 శాతం మేర తగ్గి 45వేల 420 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం తగ్గి 66వేల 600 రూపాయల వద్దకు చేరింది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42వేల 100గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45వేల 930 రూపాయలుగా నమోదవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి.