శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (12:08 IST)

ఫిబ్రవరిలో పరుగులు తీసిన బంగారం.. మార్చిలో తగ్గిపోయాయ్..

ఫిబ్రవరి నెలలో పరుగులు తీసిన బంగారం, వెండి ధరలు మార్చి నెలారంభం నుండి తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే బుధవారం కూడా బంగారం ధర తగ్గి, దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.33,430కి క్షీణించింది. గత వారం రోజుల నుండి పసిడి ధరలలో తగ్గుల ప్రారంభమై బుధవారానికి రూ.1,220 తగ్గింది.


డిమాండ్ తగ్గడమే ఈ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక వెండి ధరలు మాత్రం బంగారం ధరలతో సంబంధం లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి రూ.39,500 ధర పలుకుతోంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1,286.95 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 15.12 డాలర్లకు చేరింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,675, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.31,460గా ఉంది. చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,030, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,810గా ఉంది. ఇలాగే కొనసాగితే బంగారు ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇంతకంటే శుభవార్త ఉండదని సంబరపడిపోతున్నారు ప్రజలు.