ఈ బంగారం ధర వుంది చూశారూ... పిచ్చెక్కిస్తుందనుకోండి...
భారత్‌లో బంగారానికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. అయితే డిమాండ్ లేని కారణంగా బంగారం ధర దిగివచ్చింది. రూ. 450 తగ్గడంతో గురువారం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.34,200కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక నగల తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం వల్లే పసిడి ధర తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ పేర్కొంది. అంతేకాకుండా అంతర్జాతీయంగానూ పసిడి ధర పడిపోయింది.
న్యూయార్క్ మార్కెట్‌లో సైతం బంగారం ధర 0.10 శాతం తగ్గడంతో ఒక ఔన్సు 1,319.10 డాలర్‌లు పలుకుతోంది. బంగారంతో పాటు వెండి కూడా అదే బాటలో పయనించింది. పారిశ్రామిక మరియు నాణేల తయారీదారు వర్గాల నుండి డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా తిరోగమనం చవిచూసింది. రూ.425 తగ్గడంతో కిలో వెండి రూ.41,050కి చేరింది. కాగా నిన్నటి ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.120 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.