మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (14:48 IST)

ప్రధాని మోడీ సర్కారు హయాంలో రెట్టింపు అయిన అప్పులు

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు ఉండగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్నారు. అయితే, ఈ నాలుగున్నరేళ్ళలో ఒక్క కుంభకోణం జరగలేదని చెప్పుకుంటున్న కమలనాథులకు ఇది నిజంగానే చేదువార్త. 
 
గత నాలుగున్నరేళ్ల కాలంలో దేశ అప్పులు రెట్టింపు అయ్యాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి అంటే 2014 జూన్ నెల నాటికి 54 లక్షల 90 వేల 763 కోట్ల రూపాయలు అప్పుగా ఉండేది. అది 2018 సెప్టెంబరు చివరికి 49 శాతం పెరిగి 82 లక్షల 3 వేల 253 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం వెల్లడించింది.