Japan Bullet Train in India: 2026లో భారత దేశానికి చేరుకోనున్న బుల్లెట్ రైళ్లు (video)
భారత్‌లో జపాన్ బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ కారిడార్‌లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంచి. ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకోనున్నాయి.
ఈ రైళ్లలో ఒకటైన ఈ5 షింకన్ సెన్‌ను 20211లోనే ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇండియా బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే.. ముంబై- అహ్మదాబాద్ మధ్య 508 కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న దేశంలోని మొట్టమొదటి హై-స్పీడ్ రైలు కారిడార్‌లో 'మేక్ ఇన్ ఇండియా' బుల్లెట్ రైలును నడపాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలు ప్రకటించింది.