సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (14:45 IST)

వ్యాపారులకు శుభవార్త : వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు

gas cylinder
క్రిస్మస్, నూతన సంవత్సరానికి ముందు వ్యాపారులకు, వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలను తగ్గించాయి. శుక్రవారం నుంచి 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.39.50 పైసలను తగ్గించినట్టు పేర్కొన్నాయి. అయితే, 14 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 
 
తాజాగా తగ్గించిన ధరను పరిగణనలోకి తీసుకుంటే ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1749 నుంచి రూ.1710కి తగ్గింది. అలాగే, ఢిల్లీలో రూ.1757 నుంచి రూ.1796.50కి తగ్గింది. కోల్‌కతాలో రూ.1908 నుంచి రూ.1868.50కి తగ్గగా, చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1968 నుంచి రూ.929కి తగ్గింది.
 
మాయమైపోతున్న ధోనీ రికార్డులు - 14 యేళ్ళ తర్వాత తొలి వికెట్ కీపర్‌గా... 
 
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. టీమిండియాకు చెందిన యంగ్ క్రికెటర్లు ఒక్కొక్కరు ఈ రికార్డులను అధికమిస్తున్నారు. దీంతో ధోనీ చేసిన రికార్డులన్నీ ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నాయి. ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్‌ 2023లో వన్డే ఫార్మెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ 14 యేళ్ల తర్వాత నిలిచాడు. పైగా, ఈ తరహా రికార్డును సొంతం చేసుకున్న రెండో వికెట్ కీపర్‌గా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య జట్టుతో గురువారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను రాహుల్ సాధించాడు.
 
ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన ఔట్ అయిన రాహుల్.. ప్రస్తుతం క్యాలెండర్ యేడాది 2023లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 యేళ్ల తర్వాత వన్డే ఫార్మెట్‌లో ఒక క్యాలెడర్ యేడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారతీయ వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. ఇతడి కంటే ముందు భారత మాజీ దిగ్గజం ధోనీ పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో ఒక యేడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా మహీ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 యేళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్‌ను సాధించిన  వికెట్ కీపర్‌ రాహుల్ కావడం గమనార్హం. 
 
జూన్ 16వ తేదీతో ముగియనున్న ఏపీ అసెంబ్లీ గడువు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ గడువు జూన్ నెల 16వ తేదీతో ముగియనుంది. ఈ లోపు కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఇందులోభాగంగా, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసింది. మూడేళ్ల కంటే ఎక్కువకాలం ఒకే చోట పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని ఆదేశించింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులనూ కూడా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింగ్, ఒడిశా రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. పోలీసులు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరికీ ఈ నియమాలు వర్తిస్తాయని కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా, 2024లో ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందు ఈసీ చర్యలు చేపట్టింది. అయితే, ఏపీ అసెంబ్లీ గడువు మాత్రం జూన్ 16వ తేదీన ముగుస్తుందని పేర్కొంది.