శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (14:40 IST)

మారుతి సుజుకి నుంచి సరికొత్త కారు గ్రాండ్ విటారా

grand vitara
దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి ఇపుడు సరికొత్త మోడళ్ళలో కార్లను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. ఆ ప్రకారంగా, తాజాగా 2022 గ్రాండ్ విటారా పేరుతో సరికొత్త కారును మార్కెట్‌లోకి తీసుకునిరానుంది. ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది. ఒక కారు ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ.9.5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. 
 
వచ్చే సెప్టెంబరు నెలలో లాంఛ్ కానున్న ఈ కారును మొత్తం ఐదు మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లలు, రెండు స్ట్రాంగ్ హైబ్రిడ్‌ ట్రిమ్‌లను అందిస్తుంది. టాప్ వేరియంట్ ధర రూ.18 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. 
 
కాగా, ఈ కారు లీటరు పెట్రోల్‌కు 27.9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని సమాచారం. అలాగే అన్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తున్న తొలి ఎస్.యు.వి కారు కావడం గమనార్హం. ఈ కారుకు ఇంజన్‌లు 1.5 లీటర్ యూనిట్లు, డిఫరెంట్ పవన్‌ను విడుదల చేయనున్నారు. 
 
1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ 101 బీహెచ్‌పీ, 136 ఎన్ఎ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది 5 స్పీడ్ మాన్యువల్‌ లేదా 6 స్పీడ్ ఆటో మేటిక్‌తో  వస్తుంది. మారుతి బ్రీజాతో పోల్చతే ఈ విటారా కారు కాస్త పొడవుగా ఉంటుంది. పైగా చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా వుంది.