గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:48 IST)

మళ్లీ ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ అవతారం

ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ ఆసియా కుబేరుడిగా అవతరించారు. ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. దేశీయ మార్కెట్లు పతనం దిశగా ఉన్నప్పటికీ, చైనా బిలియనీర్‌ జాంగ్‌ షంషన్‌ను వెనక్కి నెట్టి 80 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ నిలిచారు. గతేడాది డిసెంబరులో అనూహ్యంగా లాభాల పట్టిన చైనీస్‌ బిజినెస్‌ టైకూన్‌ షంషన్‌ సుమారు 98 బిలియన్‌ డాలర్ల సంపదతో అంబానీని వెనక్కి నెట్టారు.
 
తన కంపెనీలు వ్యాక్సిన్‌ తయారీ సంస్థ బీజింగ్‌ వాంటాయి బయోలాజికల్‌ ఫార్మసీ ఎంటర్‌ప్రైజ్‌, నోన్గ్‌ఫూ బీవరేజ్‌ కంపెనీ షేర్లలో భారీగా పెరిగిపోవడంతో టాప్ ర్యాంకులో నిలిచారు. వారెన్‌ బఫెట్‌ను అధిగమించి అత్యంత ఆరో సంపన్న వ్యక్తిగా నిలిచారు. ప్రస్తుతం షంషన్‌ సంపద విలువ 76.6 బిలియన్‌ డాలర్లు అని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఈ వారంలో బాటిల్-వాటర్ కంపెనీ రికార్డు 20శాతం వృద్ధిని సాధించింది.
 
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. చైనా వ్యాపారవేత్త విలువ 76.6 బిలియన్ డాలర్లు, గత వారం గరిష్ట స్థాయి నుండి 22 బిలియన్ డాలర్లకు పైగా తగ్గింది. గత వారం రోజుల్లోనే షంషన్‌ 22 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోయారు. దీంతో ముకేశ్‌ అంబానీ ఆయన స్థానంలోకి వచ్చారు. అంబానీ గత రెండేళ్లలో ఎక్కువ భాగం ఆసియా అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో ముందున్నారు. ఈ వారంలో హాంకాంగ్ చైనా స్టాక్ మార్కెట్ల ర్యాలీ క్షీణించింది.