గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (14:05 IST)

ఈపీఎఫ్ఓ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఈజీ

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తమ వినియోగదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ప్రస్తుతం సులభతరం చేసింది. ఆన్ లైన్ లేదా ఫోన్ ద్వారా రెండు నిమిషాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. ఆన్ లైన్, ఎస్ఎంఎస్, ఫోన్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.
 
పీఎఫ్ అమౌంట్ చెక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి "EPFOHO UAN LAN" ను 7738299899 కు ఎస్ఎంఎస్ పంపాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ రింగ్ అయిన తర్వాత వెంటనే మీ కాల్ డిస్ కనెక్ట్ అవుతుంది. ఆ వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ సహా ఈపీఎఫ్ అకౌంట్ డీటైల్స్ మీకు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.
 
ఇకపోతే.. ఈపీఎఫ్ఓ మెంబర్ పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login)లో UAN నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.