ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఆగస్టు 2020 (10:04 IST)

నెట్‌మెడ్స్‌ షేర్‌ని కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్

RIL
నెట్‌మెడ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 6.2 బిలియన్ రూపాయల షేర్‌ని కొనుగోలు చేసింది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.కామ్ ఇంక్ భారతదేశంలో ఆన్‌లైన్ ఔషధ అమ్మకాల సర్వీస్‌ని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. వైటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 60% హోల్డింగ్‌‌ను తాము కలిగి ఉన్నామని రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
 
నెట్‌మెడ్స్ , వైటాలిక్ ఇంకా దాని అనుబంధ సంస్థలు 2015లో విలీనం చేసారు. నెట్‌మెడ్స్ అనేది లైసెన్స్ పొందిన ఇ-ఫార్మా పోర్టల్. వైద్యులు సూచించిన మందులతో పాటుగా భారత్‌లో లభించే అన్ని రకాల మందులను ఉత్పత్తి చేస్తుందని రిలయన్స్ పేర్కొంది. ఈ సంస్థలో తాము పెట్టుబడులు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వివరించింది.
 
ఇకపోతే.. ఒప్పందాల దూకుడును ప్రదర్శిస్తున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇటీవల తమ షేర్ల విలువను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా నెట్‌మెడ్స్‌తో 620 కోట్ల రూపాయల విలువైన మేజర్ వాటాను సొంతం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో.. భారతదేశం అంతటా అధిక నాణ్యత, సరసమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల లభ్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నామని ఆర్‌ఆర్‌విఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో దేశవ్యాప్తంగా డిజిటల్ ఫ్రాంచైజీకి  నిర్మాణంలో నెట్‌మెడ్స్ కృషి తమను ఆకట్టుకుందని,  దీన్ని  మరింత వేగవంతం చేస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. డిజిటల్ వ్యాపారాన్ని మరింత విస్తరించగలమని చెప్పారు. అలాగే వినియోగదారులకు రోజువారీ కావాల్సిన వాటిని మరింత ఎక్కువగా అందించగలమని వెల్లడించారు.