టీటీడీ ఛైర్మన్ ముందుచూపు.. YES BANK నుంచి దేవుడి సొమ్ము రిటర్న్

tirumala
tirumala
సెల్వి| Last Updated: శుక్రవారం, 6 మార్చి 2020 (16:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుచూపుపై ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యస్ బ్యాంకులో వున్న రూ.600కోట్ల శ్రీవారిని డిపాజిట్లను కొన్ని నెలల క్రితమే వైవీ సుబ్బారెడ్డి ఉపసంహరించుకోవడం ఎంతో మేలు జరిగింది.

యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని ఆధీనంలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్‌‍పై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో వినియోగదారులకు పెద్దమొత్తంలో డబ్బు డ్రా చేసే విషయంలో ఇబ్బందులు తప్పలేదు.

ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ హయంలో ఎస్ బ్యాంకుతో సహా 4 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులను టీటీడీ డిపాజిట్లు చేసింది. టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత...డిపాజిట్లపై వైవీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు.

ఎస్ బ్యాంకు పరిస్థితులపై ముందే ఆరా తీసిన వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో వెంటనే అందులో ఉన్న డిపాజిట్లను రిటర్న్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 600 కోట్ల టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించుకుంది.దీనిపై మరింత చదవండి :