శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:23 IST)

ఫ్లై యాష్‌- బాక్సైట్‌ వ్యర్థాల వినియోగం కోసం నిర్మాణ రంగ పరిశ్రమతో వేదాంత అల్యూమినియం భాగస్వామ్యం

భారతదేశంలో అతిపెద్ద అల్యూమినియం, విలువ ఆధారిత ఉత్పత్తుల ఉత్పత్తిదారు వేదాంత అల్యూమినియం బిజినెస్‌  ఇప్పుడు తమ ఫ్లై యాష్‌, బాక్సైట్‌ వ్యర్ధాలను వినియోగించేందుకు సిమెంట్‌, నిర్మాణ- మౌలిక వసతుల పరిశ్రమలతో భాగస్వామ్యం చేసుకుంది.

 
దీనిలో భాగంగా జాతీయ స్థాయిలో ఓ వెబినార్‌‌ను నిర్వహించింది. సిమెంట్‌ పరిశ్రమకు చెందిన నిపుణులతో పాటుగా అంతర్జాతీయంగా పలువురు ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. వీరిలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, సర్క్యులర్‌ ఎకనమీ, పాలసీ అడ్వొకసీ, ఏఎఫ్‌ఆర్‌ అండ్‌ కో-ప్రాసెసింగ్‌, గ్లోబల్‌ కన్సల్టెంట్‌ ఉల్లాస్‌ పార్లికర్‌; స్కూల్‌ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ వీరేంద్ర కుమార్‌ పౌల్‌; వేదాంత్‌ లిమిటెడ్‌ అల్యూమినియం బిజినెస్‌ ఆర్‌ అండ్‌ డీ డైరెక్టర్‌ డాక్టర్‌ అమిత్‌ ఛటర్జీ తదితరులు పాల్గొన్నారు.

 
వేదాంత అల్యూమినియం బిజినెస్‌ సీఈవో రాహుల్‌ శర్మ మాట్లాడుతూ, ‘‘మేము చేసే వ్యాపారంలో సస్టెయినబిలిటీ ప్రాధమిక సూత్రాలను సౌకర్యవంతంగా మిళితం చేయాలనుకుంటున్నాము. ఈ క్రమంలోనే మా ఉత్పత్తుల రూపకల్పనలో వచ్చే ఇతర పదార్థాలను ఇతర సంస్ధల వినియోగానికి అనుకూలంగా మార్చాలనుకుంటున్నాము. అందులో భాగంగా అనుకూలమైన పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకుంటున్నాము. భారతీయ సిమెంట్‌ ఉత్పత్తిదారులు పరస్పర ప్రయోజనం కలిగించే వినూత్నమైన పరిష్కారంతో రాగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
ఉల్లాస్‌ పర్లీకర్‌ మాట్లాడుతూ, ‘‘ఫ్లైయాష్‌ మరియు బాక్సైడ్‌ వ్యర్థాలు సిమెంట్‌ పరిశ్రమలో వినియోగానికి అసాధారణ ప్రయోజనం కలిగించగలవు. వీటిని తగిన రీతిలో వినియోగిస్తే  సస్టెయినబిలిటీ వృద్ధి చెంది సర్క్యులర్‌ ఎకనమీ సాధ్యమవుతుంది’’ అని అన్నారు. ‘‘ఫ్లైయాష్‌ మరియు బాక్సైట్‌ వ్యర్థాలను వినియోగించడం ఇప్పుడు అత్యవసరం. వీటిని ఇతర పరిశ్రమలలో మెరుగ్గా వినియోగించడం వల్ల వ్యయం తగ్గే అవకాశాలున్నాయి. అందువల్ల విభిన్నంగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది’’ అని ప్రొఫెసర్‌ వీకె పౌల్‌ అన్నారు.