సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (09:04 IST)

దిగొచ్చిన కూరగాయ ధరలు.. టమోటా కిలో రూ.15

vegetables
కూరగాయ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.  గత మూడు నెలల పాటు ఆకాశాన్ని అంటిన టమోటా ధరలు ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ. 15కు పడిపోయింది. 
 
వంకాయ, బెండ, దొండ, కాకర, పచ్చిమిర్చితో పాటు అన్నీ కూరగాయల ధరలు దిగొచ్చాయి. ఏపీలోని మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా అత్యల్పంగా రూ. 5 నుంచి రూ. 9 మధ్య పలికింది. అలాగే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూరగాయల ధరలు దిగి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.