మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 26 జులై 2021 (19:06 IST)

మద్యపాన రంగ నియంత్రణ, ధరల కోసం ప్రాధమిక సూత్రాలను అభివృద్ధి చేయడంపై నివేదిక

ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) మరియు పీఎల్‌ఆర్‌ చాంబర్స్‌  సంయుక్తంగా ఓ నివేదికను ‘భారతదేశంలో మద్యపానీయ రంగాల నియంత్రణ కోసం మౌలికసూత్రాల అభివృద్ధి’ శీర్షికన విడుదల చేసింది. ఈ నివేదికను ఐసీఆర్‌ఐఈఆర్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీ ప్రమోద్‌ భాసిన్‌ విడుదల చేశారు. అనంతరం ఓ చర్చా కార్యక్రమాన్ని ‘భారతదేశంలో వ్యాపారాలను చేయడం, నియంత్రణ మరియు ఆల్కహాలిక్‌ పానీయాల ధరలు’ అనే అంశంపై నిర్వహించారు.
 
ఈ చర్చలో సుప్రసిద్ధ ప్యానలిస్ట్‌లు శ్రీ రాజీవ్‌ మెహ్రిషి, పూర్వ కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా; శ్రీమతి నీతా కపూర్‌, సీఈవొ, ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎస్‌డబ్ల్యుఏఐ); డాక్టర్‌ సుదీప్తో ముండ్లీ, సీనియర్‌ ఎడ్వైజర్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయ్డ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌); శ్రీ వినోద్‌ గిరి, డైరెక్టర్‌ జనరల్‌, కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమానికి మోడరేటర్‌గా శ్రీ సుహాన్‌ ముఖర్జీ, మేనేజింగ్‌ పార్టనర్‌,  పీఎల్‌ఆర్‌ చాంబర్స్‌ వ్యవహరించారు.
 
రాష్ట్రాల ఎక్సైజ్‌ విధానాలు మరియు కలెక్షన్స్‌పై ప్రాధమికంగా అధ్యయనం, విశ్లేషణలు జరిపిన ఆధారంగా, విడుదల చేసిన ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం డిజిటల్‌ ఇండియాకు పిలుపునిచ్చినప్పటికీ, చాలా రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్‌ మరియు లైసెన్సింగ్‌ విధానాల అమలు ఇప్పటికీ మాన్యువల్‌గానే ఉన్నాయి. రాష్ట్రాలు తమ ఎక్సైజ్‌  విధానాల ద్వారా మద్యపానీయాల మొత్తం సరఫరా శ్రేణిని నియంత్రిస్తున్నాయి.
 
వీటిలో తయారీ దారుల సంఖ్య మొదలు హోల్‌ సేలర్లు, లైసెన్స్‌లను పరిమితంగా జారీచేయడం ద్వారా రిటైలర్ల సంఖ్యలో పరిమితి విధించడం, ఏ ఉత్పత్తిని ఎంత ధరకు విక్రయించాలి లాంటి అంశాలు దీనిలో ఉన్నాయి. అంతేకాదు, రిటైలర్లు ఉన్న ప్రాంతాలను సైతం రాష్ట్రాలు కనుగొంటున్నాయి. పలు రాష్ట్రాల వ్యాప్తంగా చట్టబద్ధంగా మద్యం సేవించేవారి వయసు అర్హతలు కూడా విభిన్నంగా ఉన్నాయి. ఈ వయసు 18 నుంచి 25 సంవత్సరాల నడుమ ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ తమ సొంత నమూనా ను ‘మద్యం సేవించి, వాహనాలను నడుపరాదు’ అనే అంశంపై ఉండటంతో పాటుగా లేబులింగ్‌ ఖర్చుకు సైతం దీనిని జోడిస్తున్నారు.
 
డాక్టర్‌ దీపక్‌ మిశ్రా, డైరెక్టర్‌ అండ్‌  సీఈ, ఐసీఆర్‌ఐఈఆర్‌ మాట్లాడుతూ ‘‘అధిక, ఊహాతీత, భరించలేనటువంటి నియంత్రణలు మరియు పన్ను విధానాలు వంటివి భారతదేశపు ఆల్కహాలిక్‌ బేవరేజస్‌ రంగంలో వ్యాపారాలను చేయడంలో అత్యధిక ఖర్చుకు తోడ్పాటునందిస్తున్నాయి. దేశీయంగా మాత్రమే కాకుండా విదేశాలలో సైతం అత్యుత్తమ ప్రక్రియలను విశ్లేషించిన తరువాత, ఈ నివేదికలో ఐదు కీలకమైన, విస్తృత శ్రేణి సూచనలు చేయడం జరిగింది, పారదర్శక మరియు ఊహించతగిన విధానాలను అభివృద్ధి చేయడం; సాంకేతికాధారిత జోక్యాలను చేయడంపై దృష్టి కేంద్రీకరించడం ; డాటా ఆధారిత నమూనాల వినియోగం వృద్ధి చేయడం; వాటాదారులతో తరచుగా సంప్రదింపులు జరుపడంతో పాటుగా దశలవారీగా టారిఫ్స్‌ను తగ్గించడం అమలు చేయడం’’ అని అన్నారు.
 
తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించిన ఈ అధ్యయనంలో  కనుగొన్న దాని ప్రకారం 2017-18 సంవత్సరంలో రాష్ట్రంలో అతిముఖ్యమైన మూడు ఆదాయ మార్గాలను (పెట్రోలియం మినహాయించి)కనుగొంది. దీనిలో ఫారిన్‌ లిక్కర్స్‌ మరియు స్పిరిట్స్‌ విభాగం అత్యధికంగా ఆదాయం (79.61%) సముపార్జించింది.  2013-4 నుంచి 2017-18 వరకూ తెలంగాణా  రాష్ట్రంలో అత్యధికంగా సీఏజీఆర్‌ 30.39% ఆదాయంను ఆల్కహాల్‌ నుంచి పొందింది. తెలంగాణాలో, విస్కీ కోసం, ఎక్స్‌డిస్టిలరీ ప్రైస్‌ (ఈడీపీ)ని ఓపెన్‌ టెండర్‌ విధానంలో కనుగొంటున్నారు. మహమ్మారి తరువాత, తెలంగాణా రాష్ట్రంలో  మద్యంపై పన్నులను దాదాపు 40% వరకూ గత ఆరు నెలల కాలంలో వృద్ధి చేశారు. ఈ కారణం చేత రాష్ట్రంలో మద్యం ధరలు గణనీయంగా పెరిగాయి.
 
రాష్ట్రంలో ఇప్పటికీ లైసెన్సింగ్‌ మరియు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మాన్యువల్‌గానే జరుగుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ఐసీఆర్‌ఐఈఆర్‌ ఛైర్‌పర్సన్‌ శ్రీ  ప్రమోద్‌ భాసిన్‌ ఈ విషయాన్నే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘‘రాష్ట్ర ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్‌, లైసెన్సింగ్‌ మరియు పర్మిట్స్‌ వ్యవస్థను ఆన్‌లైన్‌  చేయాల్సి ఉంది. డిజిటలైజేషన్‌ కారణంగా అత్యుత్తమంగా, పారదర్శకంగా మొత్తం ఆదాయ సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడం వీలవుతుంది. డాటా ఎనలిటిక్స్‌ మరియు సాంకేతికాధారిత పరిష్కారాలను స్వీకరించడంతో పాటుగా సరఫరా శ్రేణిని సైతం పర్యవేక్షించడం ద్వారా గుర్తించడమూ చేయవచ్చు. వినూత్నమైన స్టార్టప్స్‌ను ఈ తరహా 1-2 నమూనా ప్రాజెక్ట్‌ల కోసం ఎంచుకోవచ్చు...’’ అని అన్నారు.
 
ఈ నివేదిక కనుగొన్న దాని ప్రకారం, అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆల్కహాలిక్‌ బేవరేజస్‌ మార్కెట్‌లలో ఇండియా ఒకటి. 2020లో ఇక్కడ ఈ మార్కెట్‌  పరిమాణం 52.5 బిలియన్‌ యుఎస్‌డీ ఉన్నట్లు అంచనా.  ఈ మార్కెట్‌ 2020 మరియు 2023 సంవత్సరాల నడుమ 6.8% సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతుందని అంచనా.  ఆల్కహాలిక్‌ బేవరేజస్‌ ఉత్పత్తి దాదాపు 23.8%  వృద్ధిని 2015–16 మరియు 2018–19 సంవత్సరాల నడుమ వృద్ధి చేయడంతో పాటుగా దాదాపు 1.5 మిలియన్‌ ఉద్యోగాలను సైతం సృష్టించింది. అంతేకాదు, 2019లో 48.8 బిలియన్‌ యుఎస్‌డీ ఆదాయం సైతం సృష్టించింది. అయినప్పటికీ చిలీ, అర్జెంటీనా లేదా చైనా దేశాలలా అతి పెద్ద ఎగుమతిదారునిగా మాత్రం ఇండియా నిలువలేదు.
 
ఈ నివేదికలో అంతర్జాతీయంగా అత్యుత్తమ విధానాల నుంచి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నేర్వాలో కూడా సూచించారు. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాల కోసం టాక్సేషన్‌ నమూనాలను సైతం అందించారు. నిరూపిత ఆధారాలు మరియు డాటా ఆధారంగా దీనిని తీర్చిదిద్దారు. అదనంగా, ఈ నివేదికలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకనుగుణంగా  అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రక్రియలను ఎలా మార్చుకోవచ్చో  కూడా చూపారు. తద్వారా  ఊహించతగిన, పారదర్శక ధరల నమూనా అభివృద్ధి చేస్తూనే, అత్యధిక ఆదాయం చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యాలను సైతం చేరుకుంటూ, వినియోగదారుల ఆరోగ్య మరియు భద్రతా ఆందోళనలను సైతం పరిష్కరించడం మరియు మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి అనుణంగా తయారీ ప్రక్రియలో పెట్టుబడులు పెట్టడం, ఉపాధి కల్పన, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడం మరియు ఎగుమతులను వృద్ధి చేయడం చేయవచ్చు.
 
మరింతగా ముందుకు వెళ్తే, పారదర్శక మరియు ఊహించతగిన నియంత్రణ మరియు ధరల మౌలిక సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి ఆల్కహాలిక్‌ బేవరేజస్‌ రంగం కోసం ఈ దిగువ విధానపరమైన సిఫార్సులను ఈ నివేదిక సూచిస్తుంది.
 
స్పష్టమైన మరియు ఊహించతగిన విధానాలు, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖలు ఖచ్చితంగా స్పష్టమైన  విధానాలను ఊహించతగిన వ్యవధిల అంటే రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కోసం అమలు చేయాలి. ఇది వ్యాపారాల విస్తరణకు సహాయపడటంతో పాటుగా దీర్ఘకాలిక  పెట్టుబడులకు సైతం తోడ్పడుతుంది మరియు నూతన వ్యాపార నమూనాలను సైతం ప్రోత్సహిస్తుంది. పన్నుల విధానాన్ని సైతం ద్రవ్యోల్భణ, ముడి పదార్థాల ధరల మార్పుల ఆధారంగా క్రమానుగతంగా సవరించాల్సి ఉంది. అత్యున్నత పారదర్శకత మరియు ఊహించతగిన విధానాలు నూతన ప్లేయర్లు ఈ రంగంలోకి రావడానికి మరియు పోటీ పెరగడానికి తోడ్పడుతుంది.
 
సాంకేతిక జోక్యాలు , రాష్ట్ర  ఎక్సైజ్‌ శాఖలు  లైసెన్స్‌లు, పర్మిట్స్‌ మంజూరు చేయడం కోసం ఖచ్చితంగా ఆన్‌లైన్‌ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉంది. ఈ విధానం కారణంగా, ఖాతాలో చేరని లావాదేవీలను నివారించడం సాధ్యం కావడంతో పాటుగా అవినీతి విధానాలు సైతం నివారించడం వీలవుతుంది. భౌతికంగా పర్యవేక్షించడానికి బదులుగా విస్తృతస్ధాయి గుర్తించతగిన వ్యవస్థల ద్వారా ఈ రంగాన్ని పర్యవేక్షించడానికి సాంకేతికతను ఖచ్చితంగా వినియోగించాలి.
 
తరచుగా సంప్రదింపులు నిర్వహించాలి, రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్లు, ఆర్థిక మంత్రులు మరియు ఇతర వాటాదారులు ఖచ్చితంగా, లోతైన రీతిలో చర్చలను పారదర్శకత, ఊహించతగిన మరియు కన్సల్టేషన్‌ ఆధారిత ధరలను కనుగొనే ప్రక్రియల కోసం ప్రారంభించాల్సి ఉంది.
 
ఈ నివేదిక నిరూపిత ఆధారిత విధాన రూపకల్పనకు ప్రోత్సహిస్తుంది మరియు మద్యపాన రంగంలో ఊహించతగిన వాతావరణాన్ని సృష్టించే దిశగా సంభాషణ, చర్చా వేదికను ఏర్పాటుచేయడాన్ని సైతం ఈ నివేదిక ప్రోత్సహిస్తుంది. ఈ నివేదికలో సూచించిన అంశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంలో తోడ్పడటంతో పాటుగా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యం విస్తరించడం మరియు మొత్తంమ్మీద ఊహించతగిన విధాన ప్రక్రియకు, అతి సులభంగా వ్యాపారాలను నిర్వహించుకునేందుకు, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారతదేశపు స్ధానం వృద్ధి చేసుకునేందుకు సహాయపడడం లక్ష్యంగా చేసుకున్నాయి.