గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (21:50 IST)

28 మంది విద్యార్థులు JEE మెయిన్స్ 2025లో హైదరాబాద్ ఆకాష్ 99 పర్సంటైల్

image
హైదరాబాద్: టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో దేశీయంగా ప్రముఖమైన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(AESL), JEE మెయిన్స్ 2025(సెషన్ 1)లో హైదరాబాద్‌కు చెందిన 23 మంది విద్యార్థులు 99 పర్సంటైల్, అంతకన్నా ఎక్కువ స్కోర్ సాధించినట్లు గర్వంగా ప్రకటిస్తోంది.
 
ఉన్నత స్కోర్లు సాధించిన విద్యార్థులు:
హర్ష్ ఎ గుప్తా, కోత ధనుష్ రెడ్డి- 99.97 పర్సంటైల్
సంహిత పొలాది, రాఘవన్ ఎపురి- 99.94 పర్సంటైల్
విశ్వ నవదీప్ గుంజే- 99.87 పర్సంటైల్
హర్షవర్ధన్ రవిచందర్- 99.81 పర్సంటైల్
భరత్ నాయుడు కిలారి- 99.74 పర్సంటైల్
గమనించదగిన విషయం ఏమిటంటే, హర్ష్ ఎ గుప్తా భౌతికశాస్త్రం(Physics), గణితశాస్త్రం (Mathematics)లో 100% స్కోర్ సాధించగా, కోత ధనుష్ రెడ్డి రసాయన శాస్త్రం(Chemistry)లో 100% స్కోర్ సాధించారు. ఈ ఫలితాలు భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పరీక్షలలో ఒకటైన JEE మైన్స్‌లో విద్యార్థుల కఠోర శ్రమ, అకాడమీక్ ప్రతిభను చూపిస్తున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిన్న ఈ ఫలితాలను ప్రకటించింది, ఇది ఈ సంవత్సరం జరగనున్న రెండు JEE సెషన్లలో మొదటిది. ఈ విద్యార్థులలో చాలామంది ఆకాష్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్‌లో చేరి, ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షలలో ఒకటిగా పేరుగాంచిన IIT JEEలో ఉత్తీర్ణులవ్వడానికి సిద్ధమయ్యారు.
 
విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్, చీఫ్ అకాడమిక్-బిజినెస్ హెడ్ శ్రీ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, "JEE మైన్స్ 2025లో మా విద్యార్థులు సాధించిన అద్భుత విజయానికి మేము గర్విస్తున్నాం. వారి కృషి, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఈ అసాధారణ ఫలితాలకు కారణమయ్యాయి. ఆకాష్‌లో, విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని అవిష్కరించుకునేందుకు అత్యున్నత విద్యను అందించడమే మా లక్ష్యం. విజయవంతమైన మా విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు, వారి భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు!"
 
JEE(మైన్స్) రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది, తద్వారా విద్యార్థులు తమ స్కోర్లను మెరుగుపరచుకోవడానికి బహుళ అవకాశాలను పొందుతారు. JEE అడ్వాన్స్‌డ్ మాత్రమే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(IITs) ప్రవేశానికి అనుమతిస్తే, JEE మైన్స్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NITs), ఇతర కేంద్ర-ఆధారిత ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రవేశ ద్వారం వంటిది. JEE అడ్వాన్స్‌డ్ రాయడానికి ముందు JEE మైన్స్ రాయడం తప్పనిసరి.
 
ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(AESL), NEET - JEE వంటి అత్యున్నత స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం సమగ్రమైన, సమర్థవంతమైన కోచింగ్ ప్రోగ్రామ్‌లను అందించడంలో ప్రఖ్యాతి పొందింది. NTSE, ఒలింపియాడ్‌ల వంటి పోటీ పరీక్షల కోసం కూడా ఈ సంస్థ విద్యార్థులకు సమగ్ర మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. ఉన్నత స్థాయి పరీక్షల కోసం శాస్త్రీయమైన శిక్షణ అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.