నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పదో తరగతి పాసైతే చాలు.. రైల్వేలో జాబ్

indian rail
indian rail
సెల్వి| Last Updated: బుధవారం, 31 మార్చి 2021 (10:04 IST)
నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. పదో తరగతి పాసైన వారికి మంచి అవకాశం తలుపు తట్టింది. నార్త్ సెంట్రల్ రైల్వే పలు అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 480 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. దీంతో పాటు ఎన్సీవీటీకి అనుబంధం పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి గమనించండి. అలానే దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 15-24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఫిట్టర్ విభాగంలో 286 పోస్టులు, వెల్డర్-11 పోస్టులు, మెకానిక్-84 పోస్టులు, కార్పెంటర్-11 పోస్టులు, ఎలక్ట్రీషియన్-88 పోస్టులు వున్నాయి. ఏప్రిల్ 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు https://www.mponline.gov.in/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.దీనిపై మరింత చదవండి :