సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:48 IST)

ముంబై కేంద్రంగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 
 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చేనెల 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్‌ రైల్వే పరిధిలోని ముంబై, పుణె, నాగ్‌పూర్‌, భుసావల్‌, షోలాపూర్‌ డివిజన్‌లలో పనిచేయాల్సి ఉంటుంది.
 
మొత్తం ఖాళీలు: 2532 
అర్హత: పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదా దానికి సమానమైన (10 +2 విధానంలో) ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎన్‌టీవీసీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అదేవిధంగా 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
 
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్‌, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 6
అప్లికేషన్లకు చివరితేదీ: మార్చి 5