2022 విద్యాసంవత్సరం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు)
ఉన్నత విద్యలో ఆవిష్కరణను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఆరంభమైన లాభాపేక్ష లేని నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) 2022 విద్యా సంవత్సరం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఈ దరఖాస్తులను నూతన తరపు ప్రోగ్రామ్‌లు అయిన బీటెక్ కోర్సులైన కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్; డాటా సైన్స్; సైబర్ సెక్యూరిటీ మరియు బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్‌లో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ కోసం ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లనుభావి ప్రపంచంలో విద్యార్ధులు విజయవంతమైన కెరీర్‌లను పొందేందుకు తీర్చిదిద్దారు.
నిట్ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, మేము కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి భావి ప్రపంచంలో అర్ధవంతమైన తోడ్పాటును మా విద్యార్థులందించేలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూనే ఉన్నాము. ఓ యూనివర్శిటీగా పరిశ్రమతో బలీయమైన బంధం మాకుండటంతో పాటుగా వారి అవసరాలను సైతం గుర్తిస్తున్నాము. అందువల్ల మా కరిక్యులమ్‌ను నేటి పరిశ్రమల అవసరాలకనుగణంగా సాంకేతికతంగా అత్యున్నత స్ధాయి నైపుణ్యాలకు విద్యార్థులకు అందించేలా తీర్చిదిద్దాము. నేటి శక్తివంతమైన పని వాతావరణంలో మా విద్యార్థులు మెరుగైన ప్రతిభను ప్రదర్శించేలా తోడ్పడటానికి కట్టుబడి ఉన్నాము అని అన్నారు. అడ్మిషన్స్ ప్రక్రియపై మరింత సమాచారం కోసం admission2022.niituniversity.in చూడండి.