సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 ఆగస్టు 2021 (18:52 IST)

100% ప్లేస్‌మెంట్స్‌ను నమోదు చేసిన నిట్‌ యూనివర్శిటీ

అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణ, సస్టెయినబిలిటీ కోసం విజ్ఙాన సమాజం సృష్టించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న లాభాపేక్ష లేని నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) మరోమారు తమ విద్యార్ధులకు 100% ప్లేస్‌మెంట్స్‌ లభించాయని వెల్లడించింది. అత్యధిక సీటీసీ సంవత్సరానికి 25 లక్షల రూపాయలగా నమోదయింది. దాదాపు 700కు పైగా ప్లేస్‌మెంట్స్‌ జరుగగా, టీసీఎస్‌, కోకాకోలా సహా సుప్రసిద్ధ సంస్థలెన్నో ఈ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.
 
ఎన్‌యు కరిక్యులమ్‌ను విజయవంతమైన కెరీర్‌లు విద్యార్థులు అందుకునే రీతిలో తీర్చిదిద్దారు. ఇటీవలనే ఈ యూనివర్శిటీ తమ నాలుగు సంవత్సరాల బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ), 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ (మార్కెటింగ్‌ అండ్‌ మార్కెటిగ్‌ ఎనలిటిక్స్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌, ఫిన్‌టెక్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌) మరియు మూడు సంవత్సరాల బీబీఏ (ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, ఫ్యామిలీ మేనేజ్డ్‌ బిజినెస్‌)లో  దరఖాస్తులను ఆహ్వానించింది.
 
నిట్‌ యూనివర్శిటీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పరిమల్‌ మండ్కీ మాట్లాడుతూ, ‘‘యూనివర్శిటీ కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి సుప్రసిద్ధ సంస్థలలో విద్యార్థులందరికీ ప్లేస్‌మెంట్స్‌ అందిస్తున్నాం. మా కోర్సులన్నీ కూడా పరిశ్రమ అవసరాలు తీర్చే రీతిలో సృష్టించబడ్డాయి..’’ అని అన్నారు.