1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (22:31 IST)

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో తమ ట్రాక్‌ రికార్డును మెరుగుపరుచుకున్న నిట్‌ యూనివర్శిటీ

విజ్ఞాన సమాజానికి అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణ- సస్టెయినబిలిటీ పరంగా ఓ రోల్‌ మోడల్‌గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్న లాభాపేక్ష లేని నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) మరోమారు తమ 100% ప్లేస్‌మెంట్‌ ట్రాక్‌ రికార్డును సాధించింది. దాదాపు 700కు పైగా ప్లేస్‌మెంట్స్‌- పరిశ్రమ భాగస్వాములు పాల్గొన్నారు. ఎయిర్‌టెల్‌, అమెజాన్‌, సిస్కో, ఐబీఎం, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా వంటి ఎన్నో సంస్థలలో విద్యార్ధులు ఉద్యోగాలు పొందారు.

 
సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్‌ వంటి నూతనతరపు కోర్సులను చేసిన విద్యార్థులకు ఐబీఎం, ఈవై, పీడీబ్ల్యుసీ, టీసీఎస్‌, మోర్గాన్‌ స్టాన్లీ వంటి వాటిలో ఉద్యోగాలు లభించాయి. డాటా సైన్స్‌లో సరాసరి జీతం సంవత్సరానికి 6.67 లక్షల రూపాయలు కాగా, సైబర్‌ సెక్యూరిటీలో ఇది 5.28 లక్షల రూపాయలుగా ఉంది.

 
నిట్‌ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ ఖన్నా మాట్లాడుతూ, ‘‘ఎన్‌యు వద్ద మా లక్ష్యమెప్పుడూ కూడా విద్యార్థులు నేర్చుకునేలా చేయడం, తమను తాము వ్యక్తీకరించుకోవడంలో సహాయపడటం. సమాజానికి తిరిగి అందించే రీతిలో విద్యార్థులకు బోధించడంపై మేము దృష్టి పెడుతుంటాం. పరిశ్రమకు అవసరమైన, పరిశోధనాధారిత విద్యను అందించడం అనేది ఎన్‌యు యొక్క ముఖ్య సూత్రాలలో ఒకటి కాబట్టి మా కోర్సులన్నీ కూడా పరిశ్రమ అవపరాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి’’ అని అన్నారు.