బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (15:49 IST)

JRF లేదా UGC NETకి పీజీ పూర్తి చేయకపోలేదంటే.. బాధపడనక్కర్లేదు..

యూజీసీ నెట్​ క్వాలిఫై అయినా సరే కరోనా కారణంగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయలేని​ అభ్యర్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). 2018 డిసెంబర్ లేదా 2019 జూన్ సెషన్లకు సంబంధించిన యూజీసీ నెట్ పరీక్షలో JRF లేదా UGC NET అర్హత సాధించినప్పటికీ, కరోనా కారణంగా మాస్టర్స్ డిగ్రీ కోర్సు పూర్తి చేయని అభ్యర్థులకు ఎక్స్​టెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 
 
ఈ ఎక్స్​టెన్షన్​ ప్రకారం, 2018 డిసెంబర్ సెషన్ యూజీసీ నెట్​ & జాయింట్​ సీఎస్​ఐఆర్​ యూజీసీ టెస్ట్​ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాస్టర్స్​ పూర్తి చేసేందుకు 2022 జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. ఇక 2019 జూన్ సెషన్​లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాస్టర్స్​ పూర్తి చేసేందుకు 2022 డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. 
 
2018, 2019లో నిర్వహించిన నెట్​ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు కరోనా కారణంగా వారి మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌ లేదా పీజీ కోర్సును పూర్తి చేయలేకపోయారు. అటువంటి వారికి ఈ వ్యాలిడిటీ ఎక్స్​టెన్షన్​ నిర్ణయం ఊరటనిచ్చేదని చెప్పవచ్చు.