పదో తరగతి మార్కుల ఆధారంగా రైల్వే శాఖలో ఉద్యోగాలు...
వెస్ట్రన్ రైల్వేలో పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా ఏకంగా 3624 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మేన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మేన్ (సివిల్) తదితర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ముంబై కేంద్రంగా పని చేసే వెస్ట్రన్ రైల్వే పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు.
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 15 నుంచి 24 యేళ్లకు మించి ఉండరాదు. విద్యార్థులకు యేడాది కాల వ్యవధిలో అప్రెంటిస్‌ను అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెన్త్, ఐటీఐ మార్కుల ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇక దరఖాస్తుల స్వీకరణకు జూలై 26వ తేదీని ఆఖరు తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం వెస్ట్రన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.