చైనా పులావ్ తయారీ ఎలా?

china pulao
PNR| Last Updated: బుధవారం, 27 ఆగస్టు 2014 (17:16 IST)
కావలసిన పదార్థాలు :
పచ్చి బియ్యం - 500 గ్రాములు,
ఉడికించిన బఠాణీలు - కప్పు,
కోడిగుడ్డు - రెండు,
వెల్లుల్లి - రెండురెబ్బలు,
సోయాసాస్ - రెండు చెంచాలు,
మిరియాలపొడి - చెంచా,
నూనె లేదా నెయ్యి - ఐదు చెంచాలు,
ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం బిరుసుగా వండుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను తోలు తీసి మెత్తగా నూరుకోండి. ఓ బాణాలిలో నూనె కానీ నెయ్యి కానీ వేసి కాగాక అందులో వెల్లుల్లి ముక్కలను వేసి దోరగా వేయించండి. ఆ తర్వాత అందులో ఉడికించిన బఠాణీలు వేసి బాగా కలపాలి. ఇందులో కోడి గుడ్లను పగుల గొట్టి వేయాలి. కాసేపయ్యాక అందులో మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి తిప్పాలి. రెండు నిముషాలయ్యాక సోయా సాస్ వేసి కలిపి ఉడికించిన అన్నాన్ని వేసి కలిపి దించినట్టయితే ఇదే చైనా పులావ్. దీన్ని వేడిగా సర్వ్ చేస్తూ ఆరగిస్తే టేస్టీగా ఉంటుంది.దీనిపై మరింత చదవండి :