బేగంపేట స్మశాన వాటికలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్
సహజంగా దెయ్యాలు, ఆత్మలు సినిమాలు తెరకెక్కించేటప్పుడు శ్మశానంలో ప్యాచ్ వ ర్క్ లా తీయడం పరిపాటి. కానీ ఏకంగా టీజర్ లాంచ్ చేయడం విశేషమేనే చెప్పాలి. అలాంటి ప్రయోగాన్ని గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ టీజర్ ను ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట స్మశాన వాటికలో విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలియజేస్తూ ప్రకటన విడుదలచేసింది. దానికితోపాటు శ్మశానవాటిక వీడియోను కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో కొద్దిసేపటి క్రితమే పెట్టింది. దీనిపై భిన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, గతంలో అంజలి హీరోయిన్‌గా రెండు పాత్రలు పోషించిన చిత్రం గీతాంజలి. దానికి సీక్వెల్ గా గీతాంజలికి 50 వ సినిమాగా గీతాంజలి మళ్లీ వచ్చింది రూపొందింది. హారర్ మూవీకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తోన్నారు. ఇందులో శ్రీనివాస రెడ్డి, రావురమేష్ కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం శ్మశానవాటిలో దెయ్యాలతో మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తాడు.