శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (12:56 IST)

మజ్జిగ పులుపు తగ్గడానికి ఏం చేయాలి?

మజ్జిగ పులుపు తగ్గడానికి
మజ్జిగ పులుసు పెట్టేటప్పుడు మజ్జిగ మరీ పుల్లగా ఉంటే అది జీర్ణం కాదు. ఇలాంటప్పుడు, ఇందులో కాస్త వెల్లుల్లి రెబ్బలు వేస్తే రుచిగా ఉండడమే కాదు తేలిగ్గా జీర్ణమవుతుంది.
 
రుచికరమైన జామూన్ కోసం
గులాబ్ జామూన్ రుచికరంగా, సాఫ్ట్‌‌గా రావాలంటే పిండి కలిపే సమయంలో కాస్త రాగీ మాల్ట్‌ను కలపండి. ఇలా చేస్తే జామూన్‌లు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా లభిస్తాయి.
 
రుచికరమైన దోసెల కోసం
వెంటనే దోశెలు వెయాలని పిండిని రుబ్బారు అయితే అది పులిస్తేనే రుచిగా ఉంటుంది కదా మరి. ఇందు కోసం మజ్జిగలో నానబెట్టిన మిరపకాయల తొడిమలను పిండిలో వేసి కాసేపాగి తీసీయండి.
 
ఉప్మా రుచి కోసం
ఉప్మా చేసే సమయంలో రవ్వను వేయించడం మరిచిపోయారా? ఫర్వాలేదు! వెసరులో తాలింపు గింజలు వేసిన తర్వాత అందులో చెంచా నెయ్యి వేస్తే ముందుకంటే చాలా రుచిగా ఉప్మా తయారవుతుంది.