శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (11:36 IST)

మిరియాల రసంలో మటన్ సూప్ చేర్చితే?

దోసెలకు పిండి రుబ్బుకునేటప్పుడు... అందులో పొట్టు తీసిన వేరుశెనగలను చేర్చితే.. దోసెలు రుచిగా వుంటాయి. మిరియాలతో రసం చేస్తున్నప్పుడు అందులో కాస్త మటన్ సూప్ చేర్చి రుచి అదిరిపోతుంది.


రాత్రిపూట మిగిలిన అన్నాన్ని మిక్సీ జారులో వేసి.. అందులో మూడు స్పూన్ల శెనగపిండి, మూడు స్పూన్ల బియ్యం పిండి, తగినంత ఉప్పు, మజ్జిగ రెండు స్పూన్లు చేర్చి రుబ్బుకుని వడియాలుగా ఎండనివ్వాలి.

తర్వాత నూనెలో వేపుకుంటే మంచి సైడిష్ రెడీ. ఫలహారాలు క్రిస్పీగా వుండాలంటే.. వాటిని వుంచే పాత్రల అడుగున ఉప్పును చేర్చితే సరిపోతుంది. 
 
మెంతికూరను వండేటప్పుడు కాసింత బెల్లం చేర్చుకుంటే.. అందులోని చేదు తొలగి తీపి రుచి చేకూరుతుంది. అరటికాయలను తరిగేటప్పుడు చేతులో కాస్త సాల్ట్ ఉప్పును రుద్దితే చేతులు నలుపు తిరగవు.

బజ్జీలు చేసుకునేందుకు కట్ చేసిన అరటి, బంగాళాదుంపల ముక్కలకు కారం, ఉప్పు చేర్చి అరగంట సేపు పక్కనబెట్టేయాలి. తర్వాత నూనెల్లో బజ్జీలు తయారు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.