శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జూన్ 2014 (16:18 IST)

వంటగదిలో టెన్షన్ పడుతున్నారా?

ఇంటిలో కిచెన్ అనేది ఒక ముఖ్యమైన ప్రదేశం. మీరు వంటగదిలో జాగ్రత్తగా ఉండాలి. వంటగదిలో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే టెన్షన్ పడకుండా ఉండాలి. సాధారణంగా వంటగది లోపల సంభవించే ప్రమాదాలు చాలా వేగంగా మరియు ఆత్రుతగా పని చేయుట వలన జరుగుతాయి. కొన్ని సార్లు నిర్లక్ష్యం ఫలితంగా కూడా జరుగుతాయి. మీరు చాలా వేగంగా కూరగాయలను కోసినప్పుడు వేళ్లు గాయపడవచ్చు. 
 
అదేవిధంగా మీరు వేడి పాన్స్, కుక్కర్లు గ్యాస్ ఆపిన వెంటనే వేడి ఆవిర్లు పోకుండా తీయకుండా జాగ్రత్త వహించాలి. పనులకు సమయాన్ని కేటాయించండి. టెన్షన్ పడకుండా పనిచేసుకుపోతే ప్రమాదాలను అరికట్టవచ్చు. కిచెన్‌లో వేడి పాన్స్ మరియు కుక్కర్లను ఉపయోగించే క్రమంలో హాట్ ప్యాడ్స్ ఉపయోగించడం చాలా మంచిది. వంటగది లోపల పనిచేస్తున్నప్పుడు మీరు సింథటిక్ బట్టలను ధరించకూడదు. కాటన్ దుస్తులు, బూట్స్ వాడటం మంచిది.