బుధవారం, 6 డిశెంబరు 2023
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (21:39 IST)

కరివేపాకు పొడి తయారీ విధానం...

కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి. కరివేపాకు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా కలిగిఉంటుంది. కరివేపాకును కూరలుగానే కాకుండా పొడిగా తీసుకుంటే ఎంత రుచ

కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి వాసన వస్తాయి. కరివేపాకు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా కలిగిఉంటుంది. కరివేపాకును కూరలుగానే కాకుండా పొడిగా తీసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు :
కరివేపాకు- 1 కప్పు
ఎండుమిర్చి - 4
జీలకర్ర- 1 స్పూన్
ధనియాలు - 2 స్పూన్స్
చింతపండు - సరిపడా
మినప్పప్పు - 2 స్పూన్స్
శనగపప్పు - 2 స్పూన్స్
వేరుశనగలు - 4 స్పూన్స్
తురిమిన పచ్చి కొబ్బరి - 1/4 కప్పు
వెల్లుల్లి- 5 రెబ్బలు
నెయ్యి - 2 స్పూన్స్
నూనె - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిని తీసుకుని అందులో నూనెను వేసి  వేడయ్యాకా ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశెనగలు, పప్పులు, చింతపండు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకరలాడేలా వేయించాలి. పై వాటినన్నిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి పొడి చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకుతో చేసిన పొడిలో కొబ్బరి పొడి కూడా కలిపి పొడి పొడిగా అయ్యేంతవరకు వేయించి దింపుకోవాలి. అంతే కరివేపాకు పొడి రెడీ.