శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:31 IST)

లాక్ డౌన్ సరిపోదు.. 21 రోజులు కాదు, 49 అంటే 21 ప్లస్ 28 రోజులు పొడిగించాలి..

కేంబ్రిడ్జ్ పరిశోధకులు లాక్ డౌన్‌పై చేసిన షాకింగ్ అధ్యయనం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఐదు రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెప్తున్నాయి. మూడు వారాల లాక్ డౌన్ సరిపోదనే ప్రధానంగా నమ్ముతున్నామని, సడలింపులతో కూడిన లాక్ డౌన్ వల్ల వ్యక్తిగత నిర్బంధం, కాంట్రాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ లాంటి నిబంధనలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు సాధ్యమవుతుందని.. తద్వారా భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిపోతుందని పరిశోధకులు తెలిపారు.
 
ముఖ్యంగా భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ 21 రోజులు కాదు, 49 అంటే 21 ప్లస్ 28 రోజులకు పొడిగిండాలని కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ థియరీటికల్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధకులు ఈ అధ్యయన ఫలితాలను తెలియజేశారు. 
 
మార్చి 25న లాక్ డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు కేంబ్రిడ్జి పరిశోధకులు తెలిపారు. నాలుగు దశల్లో వేర్వేరు నియంత్రణ ప్రోటోకాల్స్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు లాక్ డౌన్లు అవసరమని గుర్తించినట్టు చెప్పుకొచ్చారు. 
 
ఇందులో మొదటి దశ ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్. ఇది వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మళ్లీ వ్యాప్తి చెందకుండా వుండేందుకు, కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇది పెద్దగా పని చేయదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సడలింపు తర్వాత ఈ దశంలో తిరిగి పుంజుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉందని గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు. కానీ 21 రోజుల లాక్ డౌన్ గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.