సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (22:43 IST)

ఏపీలో కరోనా తగ్గుముఖం, 13 వేల కేసులకు దిగువన...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 20 వేలకు పైబడి కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..24 గంటల వ్యవధిలో 12 వేల 994 మందికి కరోనా సోకింది. 96 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో 2,03,762 యాక్టివ్ కేసులు ఉండగా..10 వేల 222 మంది చనిపోయారు.
 
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2 వేల 652 కొత్తగా కరోనా కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 15,90,926 పాజిటివ్ కేసులకు 13, 76, 942 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2, 03, 762గా ఉంది. గడిచిన 24 గంటల్లో 18 వేల 373 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1, 86, 76, 222 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.