శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (17:30 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ-ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. కరోనా తీవ్రత కారణంగా రోజుకు 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడచిన 24 గంటల్లో 43,763 శాంపిల్స్ పరీక్షించగా 12,926 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,538కి పెరిగింది. అదే సమయంలో 3,913 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,66,194 పాజిటివ్ కేసులు నమోదైనాయి
 
విశాఖ జిల్లాలో 1,959 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,566 కేసులు, అనంతపురం జిల్లాలో 1,379 కేసులు, గుంటూరు జిల్లాలో 1,212 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,001 కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ భారీగా కొత్త కేసులు గుర్తించారు.